MDK: నేటి నుంచి 30 వరకు మహిళా ఆర్థిక వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు, శాఖల అధికారులు సమన్వయంతో వారోత్సవాలను నిర్వహించాలని పేర్కొన్నారు.