ఆసిఫాబాద్ జిల్లాలో ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల శంకుస్థాపనలతో పాటు మహిళా భద్రత, పోష్ (POSH) చట్టంపై అవగాహన కల్పిస్తారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, మహిళా సంఘాల సమావేశాలను గ్రామ, మండల స్థాయిలో విజయవంతం చేయాలని కలెక్టర్ హరిత ఆదేశించారు.