KDP: ప్రొద్దుటూరు బీజేపీ నాయకుడు, సీనియర్ న్యాయవాది గొర్రె శ్రీనివాసులుకు కీలక పదవి లభించింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన FIRD, గొర్రె శ్రీనివాసులను ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమిషనర్గా నియమించింది. ఈ నియామక పత్రాన్ని బెంగళూరులో సౌత్ ఇండియా ఛైర్మన్ అరవింద్ గోవిందప్ప చేతుల మీదుగా శ్రీనివాసులు ఆదివారం అందుకున్నారు. ఈ పదవికి న్యాయం చేస్తానని ఆయన తెలిపారు.