BHNG: భూదాన్ పోచంపల్లి మండలంలో ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 25రోజులు పైగా ధాన్యం పోసి రోజుల తరబడి వేచి చూసినా కాంటా వేయకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చినా తూకం వేసేవారు లేకపోవడంతో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు.