కాకినాడ జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఆదివారం సాయంత్రం రౌడీషీటర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయా స్టేషన్లకు పిలిపించిన రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని, ఎలాంటి వివాదాల్లోనూ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు.