SKLM: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిల్లలతో పీఎం మోదీ సరదాగా గడిపిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఆదివారం చక్కర్లు కొట్టాయి. వీటిని మోదీ ఆయన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకున్నారు. తనను కలిసేందుకు ఇద్దరు చిన్నారులు వచ్చారని మోదీ తెలిపారు. ప్రధానితో 20 నిమిషాల ఆత్మీయ భేటీ జరిగిందని తన పిల్లలతో సమయం గడిపారని కేంద్రమంత్రి ప్రకటనలో తెలిపారు.