పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయడమే తన చివరి కోరికని నిర్మాత బండ్ల గణేష్ వెల్లడించాడు. తెలుగు ప్రేక్షకులంతా ఉలిక్కిపడేలా ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. ఆ సినిమా తర్వాత తన ‘పరమేశ్వరా ఆర్ట్స్’ బ్యానర్‌ను క్లోజ్ చేస్తానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. పవన్ తనకు దేవుడు లాంటివాడని వ్యాఖ్యానించాడు.