ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. RRతో జరిగిన మ్యాచ్లో 60 పరుగులు చేయడం ద్వారా సూర్య.. MI తరఫున IPL, ఛాంపియన్స్ లీగ్ టీ20లలో కలిపి 4000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ శర్మ (6432 పరుగులు) తర్వాత MI తరఫున ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా సూర్య సరికొత్త రికార్డు సృష్టించాడు