ప్రకాశం: సింగరాయకొండలోని బుంగ బావి వీధిలో ఆదివారం దొంగలు రెచ్చిపోయారు. షేక్ మహమ్మద్ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో దొంగలు ఎవరూ లేని సమయాన్ని చూసి చోరీకి పాల్పడ్డారు. బీరువా పగలగొట్టి 20 సవర్ల బంగారాన్ని అపహరించారు. కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సమయంలో దొంగతనం జరిగిందన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.