HNK: “అరైవ్ – అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఎల్కతుర్తి మండలం చింతల్ పల్లి గ్రామ సభకు సోమవారం సీపీ సన్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి వెళ్తున్న స్కూల్ బస్సులోని విద్యార్థులు కిటికీల ద్వారా సీపీకి కరచాలనం చేయగా, ఆయన వెంటనే స్పందించి చిన్నారులతో స్నేహపూర్వకంగా కరచాలనం చేశారు. ఈ ఘటనతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు.