TG: హైదరాబాద్లో నిర్మించిన ఫాతిమా కాలేజీపై హైకోర్టులో విచారణ జరిగింది. సల్కం చెరువులో కాలేజీ నిర్మించారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ కాలేజీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. కాలేజీలో అడ్మిషన్లు తీసుకునేవారు రిస్క్ చేయాల్సిందేనని.. ఈ విషయాన్ని నోటీస్ బోర్డులో పెట్టాలని కాలేజీ యాజమాన్యాన్నిహైకోర్టు ఆదేశించింది.