రేపు బెంగళూరు వేదికగా RCB, LSG జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీకి గాయమైనట్లు సమాచారం. దీంతోనే అతడు ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. ప్రస్తుతం కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినప్పటికీ, కాలికి కట్టుతో కనిపించాడు. దీంతో అతడు ఆడుతాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.