KKRతో జరుగుతున్న మ్యాచ్లో CSK, KKR ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత వారం కన్నుమూసిన భారత క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) మృతికి సంతాపంగా ఇరు జట్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆయన మరణం పట్ల గౌరవసూచకంగా ప్లేయర్లు నల్ల రిబ్బన్లు ధరించి నివాళులర్పించారు.