SRCL: వేములవాడ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా రాంపల్లి వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణ నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. అధ్యక్షుడిగా రాంపల్లి వెంకటరమణ, ఉపాధ్యక్షుడుగా కొక్కుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తాటికొండ రాజు, కోశాధికారిగా రాపల్లి శ్రీధర్ పేరిట సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఏకగ్రీవమయ్యారు.