AP: రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నిన్న కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు అధికారులు వెల్లడించారు.