HNK: శాయంపేట మండలం గట్ల కానిపర్తి గ్రామానికి చెందిన పూజారి విజయ్ కుమార్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. మార్చి 24న ఇంటి నుంచి బయలుదేరిన ఆయన గుండ్లసింగారం శివారులోని కాకతీయ కాలువలో పడ్డారు. ఆయన ద్విచక్ర వాహనంపై కాలువ కట్టపై వెళ్తుండగా పశువులు, వాహనాలు అడ్డుగా రావడంతో అదుపుతప్పి కాలువలో పడినట్లు మంగళవారం కేయూ పోలీసులు తెలిపారు.