VKB: బంట్వారం నుంచి సల్బతాపూర్ వెళ్లే రహదారిపై పిచ్చి మొక్కలు పెరిగి రోడ్డును ఆక్రమిస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే వార్తతో పాటు Xలో కలెక్టర్, ఎస్పీకి ట్యాగ్ చేసి విజ్ఞప్తి చేసినా స్పందన లేదన్నారు. రాత్రివేళ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.