MBNR: కోయిలకొండ మండలం రామన్నపల్లి తండాలో మురుగు కాలువలు లేక రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తోంది. ఇంకుడు గుంతలు నిండిపోవడంతో నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. రోడ్లు జారుడుగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మురుగు నాళాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు.