గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయిజ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని ఏవో జనార్దన్, విండో సీఈవో మల్లేష్తో కలిసి మంగళవారం సందర్శించారు. తేమ శాతం 14 లోపు ఉండేలా, తాలు లేకుండా రైతులు పంటను తీసుకురావాలని సూచించారు. ఏఈవోలు టోకెన్ల ద్వారా కొనుగోలు చేయాలన్నారు.