TG: టెట్ పరీక్ష దరఖాస్తులకు ఈనెల 30వ తేదీ చివరి గడువు అని కన్వీనర్ రమేష్ తెలిపారు. అభ్యర్థులు వెంటనే రుసుము చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇందులో పేపర్-1కు 21,826, పేపర్-2కు 59,271 మంది దరఖాస్తు చేయగా.. రెండు పేపర్లకూ 12,417 మంది అప్లై చేశారు. ఇప్పటి వరకు మొత్తం 93,514 దరఖాస్తులు అందాయి.