WGL: పర్వతగిరి మండల బీజేపీ అధ్యక్షుడిగా ఏబీ తండాకు చెందిన హర్కావత్ వినోద్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన వినోద్ కుమార్, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులతో కలిసి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని తెలిపారు.