SRPT: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న 69వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-14 బాలికల క్రికెట్ పోటీలకు కోదాడకు చెందిన వర్షిని ఎంపికైంది. ఈ నెల 23న రంగారెడ్డిలో నిర్వహించనున్న ఈ పోటీల్లో, వర్షిని పాల్గొననున్నదని కోచ్ సిద్ధిఖ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఈ సందర్భంగా వర్షిని ప్రత్యేకంగా అభినందించారు.