SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైనబద్ది పోచమ్మ ఆలయంలో భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా సోమవారం భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయమే బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి బోనాలతో చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది.