NGKL: ఈ నెల 28న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగే డీవైఎఫ్ఐ జిల్లా మూడో మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను కోడేరు మండలంలోని జనుంపల్లిలో మంగళవారం స్థానిక నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడుతూ.. డీవైఎఫ్ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, మహేశ్, విజయ్, ధర్మేంద్ర పాల్గొన్నారు.