TG: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో CM రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అప్పట్లో గగ్గోలు పెట్టి, ఇప్పుడు CBIకి కేవలం రూ.9 వేల కోట్ల స్కామ్ జరిగిందని అర్థం లేని లేఖ రాయడం వెనుక మర్మం ఏమిటని ప్రశ్నించారు. అసలు ఏ ఆధారాలను బట్టి CBI విచారణ చేపట్టాలో సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.