AP: తమిళనాడుకు పూర్వవైభవం రావాలంటే ఎన్డీయే కూటమిని గెలిపించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశానికి మోదీ వంటి సమర్థ నాయకత్వం ఉందని చెప్పారు. సరైన సమయంలో మంచి ఆలోచన చేయాలని తమిళ ప్రజలను కోరారు. కేంద్రం.. తమిళనాడుకు సహకారం అందించినా డీఎంకే సరిగ్గా ఉపయోగించుకోలేదని తెలిపారు. అవినీతి, శాంతిభద్రతల సమస్య, డ్రగ్స్, అప్పుల భారం తప్ప డీఎంకే సాధించిందేమీ లేదన్నారు.