SRD: సంగారెడ్డి పట్టణంలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 సంవత్సరానికి ఈనెల 15 నుంచి మే 7వ తేదీ వరకు మొదటి విడత దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు www.dost.cgg.gov.inలో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.