WGL: బల్దియా కార్యాలయంలో జనగణన హౌజ్ బ్లాక్ లిస్టింగ్ ప్రక్రియను మేయర్ గుండు సుధారాణి మంగళవారం పరిశీలించారు. GWMC పరిధిలోని అన్ని రెవెన్యూ వార్డుల్లో గృహ సముదాయాలు పూర్తిగా కవర్ అయ్యేలా సమగ్ర మ్యాపింగ్ చేపట్టాలని ఆమె సూచించారు. ఏ ఒక్క గృహాన్ని వదలకుండా, అధికారుల సమన్వయంతో ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.