ఇండి కూటమి నేతలు ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నియోజకవర్గాల పెంపు బిల్లు, డీలిమిటేషన్ బిల్లులోని అంశాలపై చర్చించనున్నారు. కాగా, ఈనెల 16న కేంద్రం పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి అధికారికంగా ఎజెండా రావడంతో ఇవాళ ఇండి కూటమి నేతల భేటీ జరగనుంది.