చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పరాజయం పొందింది. 193 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 రన్స్ మాత్రమే చేయగలిగింది. KKR బ్యాటర్లలో రమణదీప్ 35, రహానే 28 పరుగులతో పర్వాలేదనిపించారు. CSK బౌలర్లలో నూర్ 3, కాంబోజ్ 2, ఖలీల్, అకేల్ హోసేన్ చెరో ఒక్క వికెట్ పడగొట్టారు.