TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఓ ఉడుంలా వచ్చాడని విమర్శించారు. ఎవరిని ఎలా తొక్కాలి, ఒక్కొక్క మెట్టు ఎట్లా ఎక్కాలి అని లక్ష్యంతో వచ్చాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర వల్లే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కానీ ఈ రెండూ రాష్ట్రాలే రాహుల్‌ను ప్రధాని కాకుండా చేశాయని మండిపడ్డారు.