కడప: రామాంజనేయపురం దగ్గర ఉన్న NTR కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.