MDCL: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ప్రారంభించిన ‘మీ సురక్ష’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని సీపీ సుమతి తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ సేవలు మరింత చేరువవుతాయని, ప్రజల సహకారంతో నేరాలను తగ్గించగలమని ఆమె అన్నారు.