BDK: ఆళ్లపల్లి, అనంతోగు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చికెన్ దుకాణాలు, పాఠశాలల పరిసరాలు, నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని గ్రామస్థులు ఇవాళ తెలిపారు. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వారిపై గుంపులుగా దాడి చేస్తున్నట్లు వెల్లడించారు.