ADB: బహిరంగ ధూమపానం ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆదివారం తెలియజేశారు. పట్టణంలోని పలు కూడలిలలో గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి ధూమపానాన్ని ప్రోత్సహిస్తున్న పట్టణానికి చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బహిరంగ ధూమపానంపై నిరంతరం ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.