అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో GT నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ, చివర్లో వాషింగ్టన్ సుందర్ అర్ధసెంచరీతో రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్ రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లతో చెలరేగాడు. భువనేశ్వర్, హేజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు.