AP: మెగా డీఎస్సీపై జగన్ కుట్రలు చేస్తున్నారని మంత్రి అనగాని అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వలేదన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకోవడానికి 32 కేసులు వేసి విఫమయ్యారని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ, అవినీతికి తావు లేకుండా మెగా డీఎస్సీ నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రశ్నాపత్రాలు దొంగలించడం, లీక్ చేయడం జగన్‌కే తెలుసని ఎద్దేవా చేశారు.