SS: హిందూపురంలో సత్యసాయి పాలియేటివ్ హోమ్ కేర్ సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. సత్యసాయి యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సాయిసదన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్, పక్షవాతం, కిడ్నీ, లివర్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇంటి వద్దే ఉచిత సేవలు అందించనున్నారు. అవసరమైన వారికి వైద్య సహాయం అందించడమే ఈ సేవల లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.