WGL: రాయపర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఆదివారం రాత్రి సింధు నాలుగేళ్ల బాలుడిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.