AP: అమలాపురంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలో చిల్డ్రన్ పార్కు అభివృద్ధికి రూ.50 లక్షల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మున్సిపల్ డంపింగ్ యార్డును పరిశీలించారు. UIDF పథకం నిధులతో డ్రెయిన్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమలాపురంలో రోడ్లను ఎండ్ టు ఎండ్ రోడ్లుగా మారుస్తామని చెప్పారు. మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.