MHBD: పెద్దవంగర మండలంలోని పడమటి తండాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెపకృతి వనాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ రకాల మొక్కలను నాటారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సర్పంచ్, నాయకులు పల్లె ప్రకృతి వనంలో ఉన్న మొక్కలు ఆరోగ్యానికి హాని చేస్తాయన్న సాకుతో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే చెట్లను నరికి వేశారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.