TPT: శ్రీకాళహస్తిలో నిర్వహించిన వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమీక్షా సమావేశం, ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీ విజయానికి కీలకమని పేర్కొంటూ.. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.