SS: జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపికైన పోలేపల్లి ప్రశాంత్ కుమార్ ఆదివారం పల్లె క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని కలిశారు. నూతనంగా ఎన్నికైన ప్రశాంత్ కుమార్ తోపాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు మాజీ మంత్రిని గజమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పోలేపల్లి ప్రశాంత్‌ను పల్లె అభినందించారు.