BHPL: సరస్వతి నది పుష్కరాల ముగింపునకు సమయం దగ్గరపడుతుండటంతో ఆదివారం కాళేశ్వరంలో భక్తుల రద్దీ పెరిగింది. పుష్కర స్నానాల అనంతరం ముక్తేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ కారణంగా దర్శనానికి ఆలస్యం అవుతున్నప్పటికీ, భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.