MLG: ములుగు అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన అమరవీరుల సంస్మరణసభలో సీపీయూఎస్ఐ జాతీయ కార్యదర్శి పగడాల కోదండ పాల్గొన్నారు. ఆదివారం జరిగినసభలో మాట్లాడుతూ “మా వాడలో మా రాజ్యం” పార్టీ లక్ష్యమని, దళిత బహుజనులకు రాజకీయ అధికారం దక్కాలని పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణ సాధనకోసం తమపోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. సభలో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.