JGL: పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన సిద్దుల ప్రశాంత్ అనే యువకుడు భారత సైన్యానికి చెందిన అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 10వ తరగతి స్థానిక జడ్పీ పాఠశాలలో చదివి, కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిఫెన్స్ చదివినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి విడుదల చేసిన ఫలితాల్లో ప్రశాంత్ అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపారు.