ATP: రాప్తాడు నియోజకవర్గం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జి.చింతలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ చింతలయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, అధైర్యపడవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.