NTR: విజయవాడ లబ్బీపేటలోని మలబార్ గోల్డ్ దుకాణం వద్ద ఒడిశాకు చెందిన ఓ యువకుడు గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు. షాపు మెట్ల వద్ద పడుకొని హడావుడి చేస్తున్న అతడిని సిబ్బంది మందలించగా.. వారిపైకే తిరగబడ్డాడు. దీంతో సిబ్బంది, స్థానికులు కలిసి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.