BPT: జిల్లాలో సుదీర్ఘకాలం సేవలందించి ఈ నెల 31న రిటైర్ అవుతున్న ఉద్యోగులను ఆదివారం ఘనంగా సన్మానించారు. జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. కలెక్టర్ వినోద్ కుమార్ ఉద్యోగులను పూలదండలు, శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ప్రభుత్వ సేవలో వారి కృషి అమూల్యమైనదని కలెక్టర్ కొనియాడారు. ప్రజాసేవలో వారు చూపిన నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొన్నారు.