CTR: పొగాకు వాడటం వల్ల ప్రాణాంతక జబ్బుల బారిన పడే అవకాశం ఉందని అర్బన్ పిహెచ్సి డాక్టర్ రమ్యకృష్ణ అన్నారు. ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం పుంగనూరు పట్టణం కొత్తపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గోడపత్రికలను ఆవిష్కరించారు. పొగాకును ఉపయోగిస్తే కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.